Share News

అత్యాపత్య క్రీడకు ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:18 PM

ప్రాచీనమైన అత్యాపత్య క్రీడ లకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. అత్యాపత్య నాగర్‌కర్నూల్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 9వ సీనియర్‌ (బాలుర, బాలికల) నే షనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి.

అత్యాపత్య క్రీడకు ప్రాధాన్యం
బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన కేరళ జట్టుకు బహుమతి ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, అధికారులు, నాయకులు

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- అట్టహాసంగా ముగిసిన జాతీయ స్థాయి పోటీలు

కల్వకుర్తి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రాచీనమైన అత్యాపత్య క్రీడ లకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. అత్యాపత్య నాగర్‌కర్నూల్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 9వ సీనియర్‌ (బాలుర, బాలికల) నే షనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీలకు తెలంగాణ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనా డు, కేరళ, బిహార్‌ రాష్ట్రాల నుంచి 240 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగినా బాలికల విభాగంలో మొదటి స్థానంలో కేరళ, ద్వితీయ స్థానంలో పుదుచ్చేరి, తృతీయ స్థానంలో తమిళ నాడు నిలిచా యి. బాలుర విభాగంలో మొదటి స్థానంలో పుదుచ్చేరి, ద్వితీయ స్థానం లో మహారాష్ట్ర, తృతీయ స్థానంలో కర్ణాటక నిలిచాయి. ముగింపు సంద ర్భంగా జిల్లా అసిసోయేషన్‌ అధ్యక్షుడు ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన బహు మతుల ప్రధానోత్సవానికి ఎమ్మెల్యే, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బా లాజీసింగ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులను ప్రదానం చే శారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడలను కల్వకుర్తిలో ని ర్వహించడం అభినందనీయ మని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యా పత్య క్రీడలకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రెండు శాతం రిజర్వేషన్లను కల్పి స్తున్నట్లుగానే, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నేషనల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ పీడీ అంజి, జిల్లెల రాములు, ఉమా మనీలా, సంజీవ్‌కుమార్‌యాదవ్‌, పసుల రమాకాంత్‌ రెడ్డి, బృంగి ఆనంద్‌కుమార్‌, శివకుమార్‌, ప్రసాద్‌, వివిధ రాష్ట్రాల అత్యాపత్య అ సోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:18 PM