Share News

రైతుల ఆదాయం పెంచడమే ప్రధాని లక్ష్యం

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:36 PM

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే ధన్‌ధాన్య కృషి యోజన(పీఎం-డీడీకేవై) పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని పాలమూరు ఎంపీ డీకేఅరుణ అన్నారు.

రైతుల ఆదాయం పెంచడమే ప్రధాని లక్ష్యం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పాలమూరు ఎంపీ డీకే అరుణ

- విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ

- మూడు జిల్లాలను పీఎం-డీడీకేవై పథకానికి ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు

గద్వాల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే ధన్‌ధాన్య కృషి యోజన(పీఎం-డీడీకేవై) పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని పాలమూరు ఎంపీ డీకేఅరుణ అన్నారు. సో మవారం గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో వ్యవసాయంలో వెనకబడిన 100 జిల్లాలను ఈ పథకానికి ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో మన రాష్ట్రంలోని 4 జిల్లాలకు అవకాశం ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలను ఎంపిక చేశారని తెలిపారు. మూడు జిల్లాల్లో ఈ పథకం ఆరేళ్ల పాటు అమలులో ఉంటుం దని వివరించారు. రైతుల ఆదాయం పెంచ డం కోసం రాష్ట్రంలోని 4జిల్లాలకు ఏడాదికి రూ.960కోట్లు వెచ్చించనున్నట్లు ఆమె వివరించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రానిపక్షంలో గిడ్డంగులలో నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణం చేస్తారని తెలిపారు. డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీలకు చిల్లి గవ్వకూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఇన్‌చార్జి డీకే స్నిగ్ధారెడ్డి, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కౌన్సిల్‌ సభ్యులు బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, సమత తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:36 PM