Share News

పాఠశాల క్రీడలకు సన్నాహాలు

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:10 PM

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) క్రీడా పోటీల ని ర్వహణకు ముందడుగుపడింది.

పాఠశాల క్రీడలకు సన్నాహాలు
జనవరిలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-17 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభంలో అధికారులు

- షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్‌జీఎఫ్‌

- ఆగస్టు, సెప్టెంబర్‌లో జట్ల ఎంపికలు

- పాఠశాల, కళాశాల స్థాయిలో పోటీలు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) క్రీడా పోటీల ని ర్వహణకు ముందడుగుపడింది. 2025-26 సంవత్స రానికి సంబంధించి పోటీలను నిర్వహించే తేదీలను ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి జిల్లాలకు ఆదే శాలు జారీ అయ్యాయి. డీఈవోల ఆధ్వర్యంలో ఎస్‌జీ ఎఫ్‌ కార్యదర్శులు, వ్యాయమ ఉపాధ్యాయులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పాఠశాల, క ళాశాల స్థాయిలో అండర్‌-14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేయ నున్నారు. పాఠశాల క్రీడల షెడ్యూల్‌ విడుదల కావడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొంది.

ఆగస్టు, సెప్టెంబరులో ఎంపికలు

ఈ ఏడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడాపోటీల ని ర్వహణ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుం ది. మండల స్థాయి పోటీలను ఆగస్టు మొదటి, రెండో వారంలో, జిల్లా స్థాయి పోటీలు ఆగస్టు మూడో వారం లో, ఉమ్మడి జిల్లా ఎంపికలు సెప్టెంబరు రెండో వారం లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ నాలుగో వారంలో తెలంగాణ పాత పది జిల్లాల జట్లతో రాష్ట్రస్థాయి పో టీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా జట్లను సిద్ధం చేస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక జట్టు పాల్గొంటే అం దులో 12 మంది ఉంటారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి చోటు దక్కుతుంది. ఎస్‌జీఎఫ్‌ పోటీ లకు క్రీడాకారులు సిద్ధమవుతుండగా, క్రీడలను పారద ర్శకంగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో డీఈవోల తో పాటు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

గతేడాది జాతీయ స్థాయికి వంద మంది..

2024-25 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో రెండు జాతీయస్థాయి, పది రాష్ట్రస్థాయి టోర్నీలు నిర్వ హించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక జాతీయ, మూడు రాష్ట్రస్థాయి టోర్నీలు, నారాయణపేటలో ఒక జాతీయ, ఒక రాష్ట్రస్థాయి టోర్నీ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో వనపర్తిలో రెండు, జోగుళాంబ గద్వా లలో మూడు, నాగర్‌కర్నూల్‌ లో ఒక టోర్నీ నిర్వహించగా, వంద మంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటారు.

Updated Date - Jul 11 , 2025 | 11:10 PM