Share News

అతి చిన్న ఖురాన్‌ గ్రంథానికి ప్రార్థనలు

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:09 PM

అగ్గి పెట్టేకన్నా చిన్న సైజులో ఉన్న అరుదైన అ తి చిన్న పురాతనమై రెండు పవిత్ర ఖురా న్‌ గ్రంథాలకు గట్టులోని జామియా మసీదులో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

  అతి చిన్న ఖురాన్‌ గ్రంథానికి ప్రార్థనలు
చిన్న గ్రంథానికి ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

- గట్టులో అగ్టిపెట్టే కన్నా చిన్న ఖురాన్‌ గ్రంథం

- 480 పేజీలు.. 30 పర్వాలు

- మిలాద్‌ ఉన్‌ నబి సందర్భంగా గ్రంథానికి ప్రత్యేక ప్రార్థనలు

గట్టు, సెప్టంబరు 5 (ఆంధ్రజ్యోతి): అగ్గి పెట్టేకన్నా చిన్న సైజులో ఉన్న అరుదైన అ తి చిన్న పురాతనమై రెండు పవిత్ర ఖురా న్‌ గ్రంథాలకు గట్టులోని జామియా మసీదులో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా మాత్రమే వీటిని కిందకు దింపి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. ఏడాదికి ఒక్కసారి మహమ్మ ద్‌ ప్రవక్త జన్నదినం సందర్భంగా మాత్ర మే వీటిని కిందకు దింపి ప్రార్థిస్తారు. అతి చిన్న గ్రంథంలోని అక్షరాలను భూతద్దంతో చూస్తేనే లిపి కన్పిస్తుంది. ఈ గ్రంథంలో మొత్తం 480 పేజీలు.. 30 పర్వాలు ఈ గ్రం థంలో ఉన్నాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఇలాంటి అరుదైన పురాతన ఖు రాన్‌ గ్రంధాలు కేవలం గట్టులో మాత్రమే ఉన్నాయని మత పెద్దలు పేర్కొంటున్నారు. గట్టుకు చెందిన ముస్లింలు తర తరాలు గా గ్రంథాలను భద్రపరుస్తూ వస్తున్నారు. మండల కేంద్రమైన గట్టులోని జామియా మసీదుతో పాటు బిచ్చాలపేటలోని మసీదు లో ఉన్నాయి. మొగల్‌ చక్రవర్తుల కాలంలో ఈ మసీదులను నిర్మించారని చెబుతున్నా రు. అప్పటి నుంచి ఈ గ్రంథాలు ఇక్కడ ఉ న్నాయని ముస్లింలు పేర్కొంటున్నారు. ఈ గ్రంథాలను దర్శించుకుంటే పాపాలు పోతాయని వారి విశ్వాసం. అందుకే మిలాద్‌ ఉ న్‌ నబీ సందర్భంగా ఇతర ప్రాంతాల నుం చి ముస్లిం మత పెద్దలు గట్టుకు వచ్చి చి న్న గ్రంథాలను దర్శించుకుని ప్రార్థనలు చే సుకుని వెళ్తారని ముస్లింలు తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 11:09 PM