Share News

అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రార్థించండి

ABN , Publish Date - May 16 , 2025 | 11:27 PM

హజ్‌ యాత్రకు బయలుదేరుతున్న నారాయణపేట యాత్రికులు పవిత్ర మక్కాలో ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ పేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి కోరారు.

అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రార్థించండి
పేటలో హజ్‌ యాత్రికులతో కుంభం శివకుమార్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌

- హజ్‌ యాత్రికుల సన్మానంలో కాంగ్రెస్‌ పార్టీ పేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి

నారాయణపేట, మే 16 (ఆంధ్రజ్యోతి): హజ్‌ యాత్రకు బయలుదేరుతున్న నారాయణపేట యాత్రికులు పవిత్ర మక్కాలో ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ పేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి కోరారు. నారాయణపేట బువ్వమ్మగుట్ట దర్గాలో హజ్‌కు వెళ్తు న్న యాత్రికులకు శుక్రవారం ఆయనతో పాటు, అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌లు శాలువాతో సత్కరించారు. హజ్‌యాత్ర మంచిగా జరగాలని కుంభం ఆక్షాంక్షించారు. అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి గయాసొద్దీన్‌ ఖాద్రీ, మహముద్‌, ఎండీ.సలీం, నవాజ్‌మోసా, అమీరొద్దీన్‌, మైనొద్దీన్‌, హస్నద్దీన్‌, హజీమ్‌మడ్కి, అబ్దుల్‌ రహిమాన్‌చాంద్‌, తాహేర్‌చాంద్‌, నిజామ్‌సుడికే, మైముద్‌సుడికే, పోషల్‌ రాజేష్‌, సతీష్‌గౌడ్‌, శ్రీనివ స్‌రెడ్డి, యూసుఫ్‌తాజ్‌, ఎజాజ్‌, ముజాహిద్దీన్‌, మైనార్టీ జిల్లా అధికారి రషీద్‌ ఉన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:27 PM