Share News

సగర సంఘం అధ్యక్షుడిగా ప్రణీల్‌ చందర్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:34 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా పాలకొండ సాయి ప్రణీల్‌ చందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 సగర సంఘం అధ్యక్షుడిగా ప్రణీల్‌ చందర్‌
సగర సంఘం అధ్యక్షుడిని సన్మానిస్తున్న నాయకులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా పాలకొండ సాయి ప్రణీల్‌ చందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగర పాలక సంస్థ పరిధిలోని ఏనుగొండ సగర భవనంలో రాష్ట్ర సగర సంఘం అధ్యక్షడు ఉప్పరి శేఖర్‌ సగర ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం జడ్చర్లకు చెందని పాలకొండ సాయి ప్రణీల్‌ చందర్‌ను అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా దేవరకద్రకు చెందిన గుంటి సత్యం, కోశాధికారిగా మూసాపేటకు చెందిన మదిగట్ల నారాయణ సగరను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌ సగర మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో పోటీ చేసి సగరుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన ప్రణీల్‌ చందర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 8 మండలాల పరిధిలో 54 గ్రామాల్లో ఉన్న సగరలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆంజనేయులు, రామ్‌సగర్‌, కేపీ రాములు, బంగారు నరసింహ్మ, చందు, గోవర్ధన్‌, దేవన్న, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:34 PM