పనిచేసే వారికే పదవులు
ABN , Publish Date - May 21 , 2025 | 11:17 PM
పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెడితే పార్టీ మనుగడ కష్టమని రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా : ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, మే 21 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెడితే పార్టీ మనుగడ కష్టమని రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో కాంగ్రె స్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్ అధ్యక్షతన టీపీసీసీ పరిశీలకులు సంజయ్ ముదిరాజ్, గౌరీ, సతీష్‌ల సమక్షంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ కమిటీల లో కొన్ని గ్రామాల్లో పార్టీ కోసం పని చేసిన వారికి సమా చారం ఇవ్వకుండా కమిటీలు వేయడం బాధకరమన్నారు. పార్టీ కోసం 45 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. మాలాంటి వాళ్లని పక్కన పెట్టి డబ్బుఉన్న వాళ్లకు టికెట్లు ఇచ్చినా.. పార్టీ కోసం పనిచేసి గెలిపించుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాయకు ల మధ్య విభేదాలు ఉన్న 35 నియోజకవర్గాలు ఉన్నాయని, ఆ ప్రాంతా లలో పార్టీ సమన్వయ కమిటీలు వేసి ఆ కమి టీల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు చేపడితే పార్టీకి మను గడ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మా ట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ వరకు నాతో పాటు ఉండి పార్టీ కోసం పనిచేసిన వారికి గతంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామ న్నారు. ఇప్పుడు వచ్చిన వారికి పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ల అభ్యర్థులు గెలిచేలా ప్రతీ ఒక్కరు పని చేయాలని సూచించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ పదవులు ఇవ్వాలని, ఇందుకోసం అందరూ కలిసికట్టుగా సమన్వయం చేసుకుని కృషి చేయాలని సూచిం చారు. టీపీసీసీ పరిశీలకులు సంజయ్ ముదిరాజ్, గౌరీ సతీష్‌లు మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.