వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల పరిశీలన
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:56 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించే పోలీంగ్ స్టేషన్లలో పోలీంగ్ నిర్వహణను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించే పోలీంగ్ స్టేషన్లలో పోలీంగ్ నిర్వహణను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. గురువారం ఐడీవోసీ సమావేశపు హాలులో వెబ్ కాస్టింగ్ జరుగుతున్న పో లింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ గద్వాల, ధరూర్, గట్టు, కే.టి.దొడ్డి మండలాల్లో పోలీంగ్ సందర్బంగా ప్రిసైడిండ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలీంగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయ డం జరిగిందన్నారు. మొదటి విడత ఎన్నికల జరిగే నాలుగు మండలాల్లో మొత్తం 106 గ్రామ పంచాయతీలలో 14 గ్రామ పంచాయతీలు ఏక గ్రీవం కాగా మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో సర్పంచు తో పాటు 839 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా పోలింగ్ స్టే షన్లలో మొత్తం 839 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1077 మంది ఏపీవోలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. 92 గ్రామ పంచాయతీలలో మొ త్తం 1,31,679 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపా రు. ఇందులో 66,994మంది మహిళలు, 84,684 మంది పురుషులు, ఒకరు ఇతరులు ఉన్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక స్టేజ్-2 అధికారి పోలింగ్ సజావుగా జరిగేందుకు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. జోనల్, స్థానిక మండల స్థాయి అధికారులు, పోలీస్ అధికారు లు, ఇతర సిబ్బంది పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, డీపీవో శ్రీకాం త్, ఇతర అధికారులు ఉన్నారు.