Share News

పోలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:01 AM

మొదటి విడత ఎన్నికల్లో మాదిరిగానే రెండవ విడత పంచాయతీ పోరులో కూడా ఓటర్లు అదే జోరును కొనసాగించారు.

 పోలింగ్‌ ప్రశాంతం
బిజినేపల్లిలో ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిలబడ్డ ఓటర్లు

- 7 మండలాల్లో పోలింగ్‌ 84 శాతం

- తూడుకుర్తిలో ఓటు వేసిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- నేరేళ్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 14 (ఆంధ్ర జ్యోతి) : మొదటి విడత ఎన్నికల్లో మాదిరిగానే రెండవ విడత పంచాయతీ పోరులో కూడా ఓటర్లు అదే జోరును కొనసాగించారు. రెండవ విడ త ఎన్నికలు జరిగిన నాగర్‌కర్నూల్‌, బిజి నేపల్లి, తిమ్మాజిపేట, కొల్లాపూర్‌, పెంట్లవె ల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లోని 147 గ్రామపంచాయతీల్లో 84శాతం మంది తమ ఓటు హక్కును వినియో గించుకున్నా రు. చెదురుముదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ పూర్తైంది.

ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు

ఆదివారం చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ దాన్ని లె క్కచేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్‌ కేం ద్రాల వద్ద క్యూ కట్టారు. 11గంటల వరకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ఆ సమయానికే బిజినేపల్లిలో 52.5 శాతం, నాగర్‌క ర్నూల్‌లో 57.1, తిమ్మాజిపేటలో 53.8, కొ ల్లాపూర్‌లో 51.8, పెంట్లవెల్లిలో 49.8, కోడేరులో 52.1, పెద్దకొ త్తపల్లిలో అత్యధికంగా 53.6శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. ఒంటిగంట వరకు కూడా ఓటర్లు వస్తుండ డంతో సమయం లోపల పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న వారికి లోపలికి అనుమతించి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఒంటిగంట వరకు బిజి నేపల్లి మండలంలో 74.11 శాతం, నాగర్‌కర్నూల్‌లో 83. 36, తిమ్మా జిపేటలో 84.17, కొల్లాపూర్‌లో 82.00, పెంట్లవెల్లిలో 81.27, కోడేరులో 69.42, పెద్దకొత్తపల్లిలో 73.77 శాతం ఓ టింగ్‌ నమోదైంది. ఒంటిగంటలోనే పోలింగ్‌ కేంద్రాల్లోకి వ చ్చిన వారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓ టింగ్‌ శాతం 84కు పెరిగింది. జిల్లాలో రెండవ విడతలో 2 లక్షల 50వేల 239మంది ఓటర్లు ఉండగా 2లక్షల 10వేల 151మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రము ఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూ డుకుర్తిలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోగా నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి కు టుంబ సభ్యులతో కలిసి తిమ్మాజిపేట మండలం నేరేళ్లప ల్లిలో ఓటేశారు.

Updated Date - Dec 15 , 2025 | 12:01 AM