Share News

పల్లె పదవులకు రాజకీయ జోష్‌

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:43 PM

పల్లెపదవు లు దక్కించుకునేందుకు ఆశావహులు పె ద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తు న్నారు.

 పల్లె పదవులకు రాజకీయ జోష్‌
సింగారం పంచాయతీ వద్ద నామినేషన్లకు ముస్తాబు చేస్తున్న సిబ్బంది

- ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 565 గ్రామ పంచాయతీలు

- సర్పంచ్‌ స్థానాలకు 471, వార్డు స్థానాలకు 444 నామినేషన్లు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రెండవ విడత నామినేషన్ల పర్వం కొనసాగింది. మరో రెండు రోజుల దాకా ఈ కార్యక్రమం కొనసాగనున్నది. మొదటి రోజు మొత్తం 565 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్‌ స్థానాలకు 471, వార్డు స్థానాలకు 444 నామినేషన్లు దాఖలయ్యాయి.

మహబూబ్‌నగర్‌/ గద్వాల/ నాగర్‌ కర్నూల్‌ టౌన్‌/ నారాయణపేట/ వనపర్తి, నవంబరు 30 (ఆంఽధజ్యోతి): పల్లెపదవు లు దక్కించుకునేందుకు ఆశావహులు పె ద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తు న్నారు. అన్ని వర్గాలలో రాజకీయ చైతన్యం కనిపిస్తోంది. మహిళలకు రిజర్వ్‌అయిన చోట, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్‌ అయిన చోట కూడా పెద్దఎత్తున పోటీకి ఆసక్తి చూపు తుండటంతో పల్లెల్లో రాజకీయ సందడి నె లకొంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్‌ల ప్రక్రియ పూర్తవగా, ఆదివా రం నుంచి రెండో విడత ఎన్నికలు జరగ నున్న మండలాలలో నామినేషన్‌లు ప్రా రంభం అయ్యాయి.

ఈ విడతలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ని ఆరు మండలాల్లో 151 సర్పంచ్‌, 1334 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నా యి. తొలిరోజే పెద్దఎత్తున నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఆరు మండలాల్లో సర్పం చ్‌ స్థానాలకు 136, వార్డు సభ్యులకు 159 నామినేషన్‌లు దాఖలయ్యాయి. సోమవా రం ఏకాదశి కావడంతో పెద్దఎత్తున నామి నేషన్‌లు వచ్చే అవకాశం ఉంది.

పోటీలో ఉండే అభ్యర్థులు ఇప్పటికే త మ పేరిట బలాబలాలు, మంచిరోజు చూ సుకుని నామినేషన్‌లు వేసేందుకు సిద్దమ వుతున్నారు. పలు గ్రామాలలో ఏకగ్రీవాల కోసం చర్చలు సాగుతున్నాయి. చాలా గ్రా మాల్లో ఇప్పటికే విందులు మొదలయ్యా యి. ఓటర్లను ఆక ర్శించేందుకు కులపె ద్దల మద్దతు కూడగ ట్టేందకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తు న్నారు.

- జోగుళాంబ గద్వాల జిల్లాలో రెం డ వ విడత నామినేషన్ల పర్వం ఆదివా రం ప్రారంభమైంది. మల్దకల్‌, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలోని 74గ్రామ పం చాయతీలకు 716 వార్డు సభ్యులకు నామినేష్లను స్వీకరించారు. ఇందులో మల్దకల్‌లో గ్రామ సర్పంచుకు 22, వార్డు సభ్యులకు 5 నామినేషన్లు దాఖలు అ య్యాయి. అదేవిదంగా అయిజలో గ్రామ సర్పంచులకు 41, వార్డు సభ్యులకు 59, వ డ్డేపల్లి మండలంలో గ్రామ సర్పంచులకు 6, వార్డు సభ్యులకు 15, రాజోలి మండలంలో గ్రామ సర్పంచులకు 9, వార్డు సభ్యులకు 17 నా మినేషన్లు దాఖలు అయ్యా యి. మొత్తం గ్రామ సర్పంచులకు 78, వార్డు సభ్యులకు 96 నామినేషన్లు దాఖలు అయినట్లు అధి కారులు తెలిపారు.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండో విడ త నామినేషన్ల దాఖలు ఆదివారం నుంచి ప్రారంభమైంది. రెండో విడతలో జిల్లాలోని బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూ ల్‌, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట మండలాల పరధిలోని మొత్తం 151 గ్రా మపంచాయతీలు, 1412 వార్డులకు ఎన్నిక లు జరుగునున్నాయి. వీటిలో మొదటి రో జు సర్పంచుకు 103 నామినేషన్లు, వా ర్డులకు 95 నామినేషన్లు వచ్చాయి.

-జిల్లాలో రెండో విడత జరిగే నారా యణపేట నియోజకవర్గంలో దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్‌ మండ లాల్లో 95 సర్పంచ్‌ స్దానాలకు 59 నామినే షన్లు, 900 వార్డు స్దానాలకు 59 నామినేష న్లు ఆదివారం వచ్చాయి. 35 క్లస్టర్‌లలో అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.

- వనపర్తి జిల్లాలోని ఐదు మండలా ల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. ఆదివారం రెండవ విడత అమరచింత, ఆ త్మకూరు, మదనాపూర్‌, కొత్తకోట, వనపర్తి మండలాల్లో సర్పంచ్‌ పదవి కోసం 95 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మరో 35 నామినేషన్లు వార్డు మెంబర్‌ స్థానాల కోసం దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.

Updated Date - Nov 30 , 2025 | 11:44 PM