రోడ్ల అభివృద్ధి పేరుతో రాజకీయ డ్రామా
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:01 PM
నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.316కోట్ల నిధులు మంజూరయ్యాయంటూ స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటన హాస్యాస్పదమని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయు లు అన్నారు.
ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి కరువు
బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాల టౌన్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.316కోట్ల నిధులు మంజూరయ్యాయంటూ స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటన హాస్యాస్పదమని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయు లు అన్నారు. 12ఏళ్ల పాటు అధికార పార్టీలో ఉన్న తాను కనీసం రోడ్లు మరమ్మతు గురించి కూడా పట్టించుకోకుండా నిధులు మంజూరు గురించి మాట్లాడితే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ఆదివారం పట్టణంలోని డీకే బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నాయకులు ఎమ్మె ల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సమావేశంలో మాట్లాడిన రామాం జనేయులు, 2014 నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అం దులోనే ఉంటూ అభివృద్ధి గురించి పదేపదే వల్లె వేస్తున్న ఎమ్మెల్యే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్ని నిదులు తెచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. తాను పార్టీ మారింది కూడా అభివృద్ధి కోసమేనని చెబుతూ గడచిన ఏడా దిన్నర కాలంలో నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం పార్టీలు మారడం తప్పా నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసింది ఏమీలేదన్నారు. డీకే అరుణ హయాంలో జరిగిన అభివృద్ది తప్పా ఇప్పటి వరకు కొత్తగా వచ్చిన అభివృద్ధి కార్యక్రమం ఏవీ లేవన్నవి అందరికీ తెలుసున్నారు. ఈ విషయం లో తాము బహిరంగంగా చర్చకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో నాయకులు బండల వెంకట్రాములు, మీర్జాపురం రామచంద్రా రెడ్డి, శ్యామ్‌రావు, రజక జయశ్రీ, ధరూర్ కిస్టన్న, దేవదాసు, శ్రీనివాసులు, హనిమిరెడ్డి, చిత్తారి కిరణ్, కృష్ణంరాజు, మోహన్ ఉన్నారు.