Share News

పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:13 PM

విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు.

పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

అయిజ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం అయిజ పోలీస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్టేషన్‌ను, పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రత తో, ఆహ్లాదకరంగా పోలిస్టేషన్‌ ఉండాలని సూ చించారు. స్టేషన్‌ రికార్డులు, సిబ్బంది విధులను తెలుసుకున్నారు. పలుసూచనలు చేశారు. అ నంతరం అయిజలోని రైతువేదికలో యూరియా సరఫరా కేంద్రాన్ని సందర్శించారు. యూరియా కోసం రైతులకు ముందస్తుగా ఇస్తున్న టోకన్ల విధానాన్ని పరిశీలించారు.మండల వ్యవసాయాధికారి జనార్దన్‌తో మాట్లాడారు. రైతులు ఇబ్బం దిపడకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో శాంతినగర్‌ సీఐ టాటాబాబు, అయిజ ఎస్‌ఐ శ్రీనివాసరావు, ట్రైనీ ఎస్‌ఐ తరుణ్‌కుమా ర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:13 PM