Share News

పోలీస్‌ సేవలు మరింత చేరువకావాలి : ఎస్పీ

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:13 PM

ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు.

పోలీస్‌ సేవలు మరింత చేరువకావాలి : ఎస్పీ
బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పిర్యాదులను మర్యాద పూర్వకంగా స్వీకరించి వారి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా వ్యా ప్తంగా 15 మంది బాధితులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతులు అందజేశారు. బాధితుల ఫిర్యాదులపై వారితో మాట్లాడిన ఎస్పీ సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుందని, వాటి పరిష్కారంపైనా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:13 PM