చేజారిన ఆభరణాలు చేతికందించిన పోలీసులు
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:30 PM
ఆభరణాలు పోగొట్టుకున్న బాధితురాలికి సీసీ పుటేజీల ఆధారంగా పో లీసులు కనిపెట్టి అప్పగించారు.
- సీసీ పుటేజీతో గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు
- బాధితురాలికి పోగొట్టుకున్న సొత్తు అప్పగింత
మహబూబ్‌నగర్ న్యూటౌన్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఆభరణాలు పోగొట్టుకున్న బాధితురాలికి సీసీ పుటేజీల ఆధారంగా పో లీసులు కనిపెట్టి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మణికొండకు చెందిన జ్యోతి శుక్రవారం మ ధ్యాహ్నం కోర్టువద్ద ఆటో ఎక్కి క్లాక్‌టవర్‌లో దిగింది. దిగిన కొద్దిసేపటికీ తన బ్యాగు ఆ టోలో మరిచిపోయినట్లు గుర్తించింది. ఆ బ్యాగులో 5గ్రాముల బంగారం, 12 తులాల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆందోళన చెం దిన బాధితురాలు నగరంలోని ట్రాఫిక్ పోలీ సులను ఆశ్రయించింది. దీంతో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ భగవంతురెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సంఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి సంబంధించిన సీసీ కెమెరాల పు టేజీలను పరిశీలించారు. పుటేజీలో వివరాల ఆధారంగా జ్యోతి ప్రయాణం చేసిన ఆటోను గుర్తించారు. అనంతరం ఆటో డ్రైవర్ హరి చందర్‌ను సంప్రదించి స్టేషన్‌కు పిలిపించా రు. ఆటో డ్రైవర్ తనవద్ద ఉన్న ఆభరణాల బ్యాగును ట్రాఫిక్ ఎస్‌ఐ బాల్యనాయక్‌కు అ ప్పగించాడు. ఎస్‌ఐ పర్యవేక్షణలో ఆభరణాల బ్యాగును జ్యోతికి అందించారు. దీంతో పోలీ సులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ వి షయమై ఎస్పీ డి.జానకి పోలీసు అధికారుల ను, సిబ్బందిని అభినందించారు.