ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పహారా
ABN , Publish Date - Mar 14 , 2025 | 10:55 PM
హోలీ, రంజాన్ మాసం దృష్ట్యా శుక్రవారం జిల్లాలోని పలు ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పహారా కొనసాగింది.

నారాయణపేట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హోలీ, రంజాన్ మాసం దృష్ట్యా శుక్రవారం జిల్లాలోని పలు ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పహారా కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని మత సామరస్యంతో మెలగాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ముందస్తు బందోబస్తు నడుమ హోలీ వేడుకలు జరిగి శాంతియుత వాతావరణం కొనసాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.