కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:51 PM
పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్ పట్టణంలోని పరదేశి నాయుడు సర్కిల్ నుండి క్లాక్ టవర్ సర్కిల్ వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
త్యాగాలు వెలకట్టలేనివి
పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్ పట్టణంలోని పరదేశి నాయుడు సర్కిల్ నుండి క్లాక్ టవర్ సర్కిల్ వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మానవహారం నిర్మించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని అమరులకు నివాళి అర్పించారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి గడియారం చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
- మహబూబ్‌నగర్ న్యూటౌన్, ఆంధ్రజ్యోతి