Share News

ఏటీఎం దొంగలను పట్టుకున్న పోలీసులు

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:14 PM

అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డులను ఏమార్చి డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకు న్నారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ శుక్రవారం వి వరాలను వెల్లడించారు.

ఏటీఎం దొంగలను పట్టుకున్న పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ చంద్రశేఖర్‌

- ముంబయిలోని గణేష్‌ గ్రూపునకు చెందిన వారిగా గుర్తింపు

భూత్పూర్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డులను ఏమార్చి డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకు న్నారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ శుక్రవారం వి వరాలను వెల్లడించారు. ఈ నెల 5 వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌కు చెందిన బత్తుల అనిల్‌ కుమార్‌ చౌరస్తాలో ఉన్న ఏటీఎం మిషన్‌ నుంచి డబ్బులు డ్రా చేయడానికి వెళ్లాడు. అక్కడే కాపు కాచి ఉన్న కొంత మంది ఏటీఎం క్యాబిన్‌ లోకి వచ్చారు. డబ్బులు డ్రా చేస్తు న్నట్లుగా నటించి అతని వద్ద ఉన్న అసలు ఏటీఎం కార్డును మార్చి, అ దే ప్రాంతంలో ఉన్న మరో బ్యాంకు ఏటీఎం లో రూ.40వేలు డ్రా చేసు కొని వెళ్లి పోయారు. అయితే డబ్బులు డ్రా అయినట్లుగా బత్తుల అని ల్‌కుమార్‌కు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బా ధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం అదే ఏటీఎం వద్ద అనుమా నాస్పదంగా తిరుగుతున్న వారిని వాకా బు చేసే క్రమంలో దొంగ పారిపోతుం డగా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా మహారాష్ట్రకు చెందిన రో హిత్‌, ఓం శంకర్‌, మధుకర్‌ శర్మ, రోహి త్‌ శర్మ, ముకేష్‌ సంతోష్‌నాగేంద్ర, ఏటీఎం దొంగలుగా తేలింది. రోహి త్‌, ఓం శంకర్‌ పట్టుబడగా, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపా రు. వీరు జూన్‌ 30వ తేదీన ముంబాయి నుంచి కారులో వచ్చి జహీరాబాద్‌, నిర్మల్‌, హైదరాబాద్‌, భూత్పూర్‌ ప్రాంతాల్లో ఏటీఎంల వ ద్ద ప్రజలను మోసం చేస్తూ డబ్బులు డ్రా చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలి పారు. ముంబయిలోని గణేష్‌బాల్చంద్‌ లోడ్తె అలియాస్‌ గణేష్‌ గ్రూపు నకు చెందిన ముఠాగా పోలీసుల విచారణలో తేలింది. కారు, ఫేక్‌ ఏటీఎం కార్డులు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 11:14 PM