పీఎం ధన్ ధాన్య కృషి యోజన ప్రణాళికలు రూపొందించాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:25 PM
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమ లుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేంద్ర మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ పీఎండీడీకేవై జిల్లా నోడల్ అధికారి పౌసుమిబసు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గద్వాల జిల్లా నోడల్ అధికారి పౌసుమిబసు
గద్వాలన్యూటౌన్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమ లుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేంద్ర మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ పీఎండీడీకేవై జిల్లా నోడల్ అధికారి పౌసుమిబసు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ బీఎం సంతోష్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బం గా ఆమె మాట్లాడుతూ రైతులు, వైవిధ్యమైన పంటలు సాగు చేస్తూ, సుస్థిర వ్యవసాయ పద్ధ తులను అవలంభిస్తూ మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలి పారు. అనుబంధ రంగాలైన ఉద్యాన, పశు, మత్స్య, తదితర రంగాల లబ్ధిదారులు సైతం తమ వృత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్ ఉండే పంటలు సాగుచేస్తూ, అధిక దిగుబడులు సాధించే లక్ష్యం గా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులతో నీటి వస తి పుష్కలంగా ఉండటంతో మత్స్య పరిశ్రమ కూడా ఆశించదగ్గ అభివృద్ధి సాధించేదిశగా ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం నోడల్ అధికారి పౌసుమిబస్సు ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో రైతులు సాగు చేసిన కూరగాయల తోటలను పరిశీలించారు. రైతులు గ్రూపులుగా కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని, ఉద్యానవన శాఖ నుంచి అందే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి జగ్గునాయక్, ఏడీఏ సంగీత లక్ష్మి, డీపీవో నాగేంద్రం, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, సంబంధిత అధికారులు ఉన్నారు.