Share News

పుష్కలంగా సాగు నీరు

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:28 PM

వనపర్తి మండలంలో సాగునీటికి నోచుకోని 13 గ్రామా లకు ఇక నుంచి పుష్కలంగా సాగు నీరు అందనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నా రు.

పుష్కలంగా సాగు నీరు
ప్రాజెక్టు సర్వే పనులకు భూమి పూజ చేస్తున్న చిన్నారెడ్డి

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి

- డాక్టర్‌ మాధవరెడ్డి లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సర్వే పనులకు భూమి పూజ

వనపర్తి రూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వనపర్తి మండలంలో సాగునీటికి నోచుకోని 13 గ్రామా లకు ఇక నుంచి పుష్కలంగా సాగు నీరు అందనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నా రు. సోమవారం వనపర్తి మండలంలోని కాశీంనగర్‌ గ్రామ శివారులో మాధవరెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ సర్వే పనులకు ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 13 గ్రామాలలోని 5వేల ఎకరాల కు సాగు నీరు అందుతుందని అన్నారు. ఇన్నాళ్లు సాగు నీరందక అందక కాశీంనగర్‌, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లి, అంజనరిగి గ్రామాలతో పాటు మరో 13 తండాల రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈ గ్రామాల రైతుల ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ప్రాజెక్టు సర్వే పనులకు రూ.22 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జిల్లెల మాధవరెడ్డి పేరు పెట్టినందుకు సీఎం, ఇరిగేషన్‌ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాములు, నంది మల్ల రాము, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కాశీంనగర్‌ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:28 PM