Share News

భూసేకరణ సర్వేలో అభ్యంతరాలుంటే తెలుపండి

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:01 PM

ప్రాజెక్టు నిర్మాణంలో మునుగుతున్న భూముల వివరాల్లో అభ్యంతరాలు ఏవైనా ఉంటే నేరుగా రైతులు తెలుపవచ్చని ఊట్కూర్‌ తహసీల్దార్‌ చింత రవి అన్నారు.

భూసేకరణ సర్వేలో అభ్యంతరాలుంటే తెలుపండి
ఊట్కూర్‌ గ్రామ సభలో మాట్లాడుతున్న తహసీల్దార్‌ చింత రవి

- నష్టపోతున్న భూ వివరాలను గ్రామసభలో వివరించిన అధికారులు

ఊట్కూర్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టు నిర్మాణంలో మునుగుతున్న భూముల వివరాల్లో అభ్యంతరాలు ఏవైనా ఉంటే నేరుగా రైతులు తెలుపవచ్చని ఊట్కూర్‌ తహసీల్దార్‌ చింత రవి అన్నారు. శుక్రవారం పేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదటి రిజర్వా యర్‌ నిర్మాణం జరిగే ఊట్కూర్‌ పెద్ద చెరువు లోపల, బయటి భాగంలో మునుగుతున్న ఊ ట్కూర్‌, బాపూర్‌, తిప్రస్‌పల్లి, దంతన్‌పల్లి, లక్ష్మీ పల్లి గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్‌ నిర్మాణ పరిధిలో లో పల, రిజర్వాయర్‌ కట్ట ముం దు భాగంలో కలిపి చివరి సర్వే చేసిన అనంతరం 508 ఎకరాల 30 గుంటల భూమి ముంపునకు గురవుతున్నదని రిపోర్టు అందిందన్నారు. ఈ రిపోర్టు ప్రకారం ఏ సర్వే నెం బర్‌లో ఏ గ్రామానికి చెందిన రైతుకు సంబంధించి ఎంత భూమి మునుగుతుందో నిర్ధా రించి ఇప్పటికే రైతులకు నో టీసులు సైతం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం గ్రామసభల్లో ఎవరికైన భూమి ఎక్కువ పోయి తక్కువ చూపిస్తున్నారనే అనుమానం ఉన్నా.. ఇతర ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పవచ్చ ని అన్నారు. అనంతరం గ్రామసభల్లో ఏ రైతు భూమి ఎంత పోతున్నదో చదివి వినిపించారు. ఈ గ్రామ సభల్లో ఇరిగేషన్‌ శాఖ ఏఈ ప్రదీప్‌, ఆర్‌ఐలు వెంకటేష్‌, కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:01 PM