Share News

అభ్యంతరాలుంటే తెలపండి

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:06 PM

మండలంలోని పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితా ముసాయిదాపై సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయ్‌కుమార్‌ సమావేశం నిర్వహించారు.

అభ్యంతరాలుంటే తెలపండి

- రాజకీయ నాయకుల సమావేశంలో ఎంపీడీవో విజయ్‌కుమార్‌

జడ్చర్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితా ముసాయిదాపై సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయ్‌కుమార్‌ సమావేశం నిర్వహించారు. మండలంలోని 45 గ్రామ పంచాయతీల్లో 376 వార్డులు, 40,862 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీడీవో వివరించారు. వీరిలో 20,081 మంది పురుషులు, 20,780 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితా ముసాయిదాకు సంబంధించిన జాబితాను గ్రామ పంచాయతీల్లోని నోటీసు బోర్డులో ప్రదర్శించామని, ఏవైన అభ్యంతరాలు ఉంటే జిల్లా పంచాయతీ అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఎంపీవో సరోజ, నాయకులు నిత్యానందం, అశోక్‌, జనార్దన్‌రెడ్డి, బుర్ల వెంకటయ్య, రఘుపతిరెడ్డి, ఇంతియాజ్‌ఖాన్‌, విజయభాస్కర్‌రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

మహ్మదాబాద్‌ : మహ్మదాబాద్‌ మండలంలోని పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితా ముసాయిదాపై సోమవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో రవీందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో పది ఎంపీటీసీ స్థానాలకు 61 పోలింగ్‌ కేంద్రాలు, 31,291 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఏదైనా అభ్యంతరాలుంటే జిల్లా పంచాయతీ అధికారికి లిఖితపూర్వకంగా తెలియచేయాలని సూచించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నారాయణ, మాజీ సర్పంచ్‌లు రాజేశ్వర్‌, రాములు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భిక్షపతి పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:06 PM