మొక్కల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:36 PM
మొక్కలు నాటి సంరక్షించడం ప్రతీ ఒక్కరి బా ధ్యత అని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.
ఖిల్లాఘణపురం, జూలై16(ఆంధ్రజ్యోతి) : మొక్కలు నాటి సంరక్షించడం ప్రతీ ఒక్కరి బా ధ్యత అని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలోని ఖిల్లా గట్టు సమీపంలో బుధవా రం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వన మహోత్సవంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. నూతనంగా పునఃనిర్మిస్తు న్న గోపాలస్వామి ఆలయంను ఎమ్మెల్యే పరిశీ లించి ఆలయ నిర్మాణానికి తనవంతు సాయం చేస్తానని ప్రకటించారు. సింగిల్‌విండో కార్యాల యంలో 8 మంది రైతులకు కర్షక మిత్ర రుణా లను ఎమ్మెల్యే మేఘారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నా రు. వ్యవసాయ అభివృద్ధికి కట్టుబడి మండలం లోని 45 మంది రైతులకు ఇప్పటికే పీఏసీఎస్ ద్వారా రూ.4.60 కోట్ల దీర్ఘకాలిక రుణాలు అంద జేశామని అన్నారు. పీఏసీఎస్‌కు నూతన గో దాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తు న్నామని తెలిపారు. మురళీధర్‌రెడ్డి, ఏవీకే ప్ర సాద్ రెడ్డి, రేంజర్ మంజుల, విజయ్ కుమార్, సాయిచర ణ్ రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.