ఫూలే జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:32 PM
మహాత్మా జ్యోతిబాఫూలే , సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.
పాలమూరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : మహాత్మా జ్యోతిబాఫూలే , సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం బోయపల్లి (16వ వార్డు) బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయిఫూలే దంపతుల విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫూలే దంపతులు స్త్రీ విద్య, వారి హక్కుల కోసం కృషి చేశారన్నారు. అంటరానితనాన్ని వ్యతిరేకించారని చెప్పారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె బాలికల విద్య కోసం నిస్వార్థంగా సేవ చేశారన్నారు. ఆనాడు సావిత్రిబాయి స్త్రీ విద్యకు చేసిన సేవలకు గుర్తింపుగా పూణె విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయిఫూలే విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారని గుర్తుచేశారు. ప్రతీ గ్రామంలో ఏ ఒక్క బాల, బాలికలు బడికి వెళ్లకుండా ఉండరాదన్నారు. ప్రతీ ఒక్కరు బడికి పోయి చదువుకునేందుకు గ్రామంలోని ప్రజా సంఘాలు కృషి చేయాలన్నారు. అనంతరం పూలే దంపతుల విగ్రహా దాతలు లక్ష్మినారాయణ, వినోద్‌గౌడ్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. అంతకుముందు అంతకముందు మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని, పూలే దంపతులు బాలికావిద్యకు చేసిన కృషిని కొనియాడారు. కాన్షీరాం, అంబేడ్కర్ లాంటి వారు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, నరసింహులు, శరత్, దండోరా నరసింహులు, బాలుయాదవ్, గోపినాయక్, దేవేందర్, వెంకట్రాములు, శ్రీనివాసాచారి, రామాంజనేయులు, రాములు, తులసీరాం, యాదయ్య, గోపాల్‌యాదవ్ పాల్గొన్నారు.