Share News

బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే

ABN , Publish Date - Apr 11 , 2025 | 10:54 PM

సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు.

బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే
ఫూలే విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ఎంపీ అరుణ, బీసీ వెల్ఫేర్‌ అధికారి ఇందిర, బీజేపీ నాయకులు, కార్యకర్తలు

జయంతి వేడుకల్లో ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఆమె జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి ఇందిర, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని పద్మావతి కాలనీ వద్ద గల ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి అని కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు పిట్టల యాదయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్‌ కుమార్‌ రెడ్డి, నాయకులు పాండురంగా రెడ్డి, క్రిష్ణవర్ధన్‌ రెడ్డి, కె.రాములు, అంజయ్య, గోపాల్‌ గౌడ్‌, రాజేష్‌, మడుగు శివశంకర్‌, బాలగోపి, నాగభూషన్‌, మల్లేశ్‌, నాగరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 10:54 PM