Share News

తీరుమారని ఫార్మా పరిశ్రమలు

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:30 PM

ఫార్మా పరిశ్రమలో నుంచి కెమికల్‌ వ్యర్థాలను ట్రాక్టర్‌ ట్యాంకర్‌లో నింపుకుని వచ్చి టీఎస్‌ఐఐసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో పారబోసిన సంఘట న మంగళవారం జడ్చర్ల మండలం పోలేపల్లిలో చోటుచేసుకుం ది.

 తీరుమారని ఫార్మా పరిశ్రమలు
జడ్చర్ల మండలం పోలేపల్లి టీఎస్‌ఐఐసీలోని ఖాళీ స్థలంలో ట్యాంకర్‌లో తీసుకువచ్చి పారబోసిన కెమికల్‌ వ్యర్థాలు

- ట్రాక్టర్‌లో తీసుకువచ్చి టీఎస్‌ఐఐసీలోని ఖాళీ స్థలంలో పారబోస్తున్న వ్యర్థాలు

జడ్చర్ల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఫార్మా పరిశ్రమలో నుంచి కెమికల్‌ వ్యర్థాలను ట్రాక్టర్‌ ట్యాంకర్‌లో నింపుకుని వచ్చి టీఎస్‌ఐఐసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో పారబోసిన సంఘట న మంగళవారం జడ్చర్ల మండలం పోలేపల్లిలో చోటుచేసుకుం ది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని కార్తీకేయ ఫార్మా పరిశ్రమ యూనిట్‌ 5లో నుంచి వ్యర్థాలను ట్రాక్టర్‌ ట్యాంకర్‌లో నింపుకుని వచ్చి టీఎస్‌ఐ ఐసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో పారబోస్తున్నారు. ట్రాక్టర్‌ ట్యాంకర్‌లో తీసుకువచ్చి వ్యర్థాలను పారబోస్తుండగా పట్టుకుని ప్రశ్నించగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని, ఇక్కడే పారబో స్తామంటూ పరిశ్రమ ప్రతినిధి భయభ్రాంతులకు గురిచేశారంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో నుంచి తీసుకువచ్చి పారబోసిన కెమికల్‌ వ్యర్థాల నుంచి బురుగులు రావడంతో భయాం దోళనకు గురవుతున్నామని, దుర్వాసన వస్తుందంటూ వాపోయారు. ఖాళీ స్థలంలో వ్యర్థాలను పారబోయడంతో కెమికల్‌ వ్యర్థాలతో పెద్ద గోతిలా ఏర్పడిందని, ఆ గుంత మొత్తం కాలుష్యం నీటితో నిండిపోయిందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. వ్యర్థాలను తీసుకువచ్చి పోస్తున్న పరిశ్రమ లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 10:31 PM