Share News

పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌ వేయించాలి

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:47 PM

ప్రతీ పెంపుడు, వీధి కు క్కలకు తప్పని సరిగా వ్యాక్సినేషన్‌ వేయించా లని జిల్లా పశువైద్య, పశుసంరక్షణ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.

పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌ వేయించాలి

పాలమూరు/భూత్పూర్‌/జడ్చర్ల/మిడ్జిల్‌/ మూసాపేట/మహమ్మదాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ పెంపుడు, వీధి కు క్కలకు తప్పని సరిగా వ్యాక్సినేషన్‌ వేయించా లని జిల్లా పశువైద్య, పశుసంరక్షణ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ యాంటి రేబీస్‌ డే సంద ర్భంగా జిల్లా కేంద్రంలోని పశువైద్య కేంద్రం లో, భూత్పూర్‌ మండల కేంద్రంలోని పశుసం వర్ధశాఖ ఆసు పత్రిలో జంతువులకు ఉచిత యాంటి రేబిస్‌ వ్యాక్సిన్‌ వేసి, ప్రారంభించా రు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ లూయిస్‌ ఫాశ్చర్‌ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు వ్యాక్సిన్‌ కనుగొన్న రోజు అని, ఆయన వర్ధంతి సందర్భంగా ఈ టీకాతో జంతువుల నుంచి మనుషులకు సోకే అతి ప్రమాదకరమైన రేబీస్‌ వ్యాధిని నివారించవచ్చు అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు శివానందస్వామి, వెంకటే శ్‌, నరేష్‌, డాక్టర్‌ మధుసూదన్‌ పాల్గొన్నారు. జడ్చర్ల ము నిసిపాలిటీ కావేరమ్మపేట పశు వైద్యకేంద్రంలో మండల పశువైద్యాధికారి ఆధ్వర్యంలో కుక్కలకు, పిల్లులకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ను వేసారు. 148 కుక్కలకు, 16 పిల్లులకు వ్యాక్సిన్‌ వేసినట్లు డాక్టర్‌ ఆశారాణి తెలిపారు. మిడ్జిల్‌ మం డల కేంద్రంలోని పశు వైద్య కేంద్రంలో డాక్టర్‌ అనుప శివ రాజ్‌ ఆధ్వర్యంలో పెంపు డు కుక్కలకు టీకాలు వేయగా, మార్కెట్‌ ఛైర్‌ పర్సన్‌ జ్యోతి అల్వాల్‌రెడ్డి పాల్గొన్నారు. మూ సాపేట మండల కేంద్రంతో పాటు జానంపేట, వేముల, పోల్కంపల్లి పశువైద్యశాల కేంద్రాల్లో ప్రజలు రాబీస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా పెంపుడు కుక్కలు, పిల్లుల కు అంటి రాబీస్‌ వ్యాక్సిన్‌(ఏఆర్‌వీ)ను వేశారు. మహ్మమ దాబాద్‌లో మండల పశువైద్యాధికారి నరేందర్‌యాదవ్‌ 40 కుక్కలకు రేబీస్‌ నివారణ టీకాలు వేశారు.

Updated Date - Sep 28 , 2025 | 11:47 PM