Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:12 PM

ఆటో అదుపు తప్పి బోల్తా పడి తీవ్ర గాయా లైన వ్యక్తి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుప త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

- మృతదేహంతో ఆటో డ్రైవర్‌ ఇంటి ముందు బంధువుల ఆందోళన

- రూ. 3.50 లక్షల ఒప్పందంతో అంత్యక్రియలు

దామరగిద్ద, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆటో అదుపు తప్పి బోల్తా పడి తీవ్ర గాయా లైన వ్యక్తి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుప త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యక్తి మృతికి ఆటో డ్రైవర్‌ కారణ మంటూ ఆటో డ్రైవర్‌ ఇంటి ముందు మృతదేహంతో భార్య, బంధువులు ఆం దోళన వ్యక్తం చేశారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇ లా ఉన్నాయి. దామరగిద్ద మండల పరిధిలోని కందెన్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు ఆటోలో బాపన్‌పల్లి గ్రామానికి పురుడు కార్యక్రమానికి ఈ నెల 3న వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న ముగ్గురు కె.చెన్నప్ప, లక్ష్మి, చె న్నప్పలకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ముగ్గురిని అంబులెన్స్‌లో నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీ సుకెళ్లగా అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించా రు. అందులో కె.చెన్నప్ప (55) పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. శుక్రవారం నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీ సుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తన గ్రామాని కి చెందిన ఆటో డ్రైవర్‌ ఇంటి ముందు ఉంచారు. కొంతమంది నాయకులు, గ్రామస్థులు శనివారం పంచాయతీ నిర్వహించి రూ. 3.50 లక్షలు మృతుడి భా ర్య చింతమ్మకు ఇవ్వాలని ఒప్పించడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.రాజు తెలిపారు.

Updated Date - Sep 13 , 2025 | 11:12 PM