గడువులోగా అనుమతులు మంజూరు చేయాలి
ABN , Publish Date - May 23 , 2025 | 11:08 PM
జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ టీజీఐ పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయాల్సిన అనుమతులను నిబంధనల మేరు నిర్ధేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
· కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట టౌన్, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ టీజీఐ పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయాల్సిన అనుమతులను నిబంధనల మేరు నిర్ధేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో పరిశ్రమ ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి ఆమె హాజరై, మాట్లాడారు. ఎస్సీ 9, ఎస్టీ 6, పీహెచ్‌సీ లకు 1, పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు డీఐపీసీ కమిటీలో ఆమోదం తెలిపారు. సమావేశంలో జీఎం భరత్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్, ఏఈ వెంక టకృష్ణారెడ్డి, లేబర్ శాఖ తరపున తిలక్, డీఎఫ్ వో సురేష్‌రెడ్డి, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ నరేష్, ఈఈ సురేష్‌బాబు, ఎన్.యోగేందర్, ఫ్యాక్టరీస్ కిరణ్‌కుమార్, రోహిన్, సయ్యద్ జహీర్, సబ్ రిజిస్ట్రార్ రామ్‌జీ, ఆర్టీవో మేఘాగాంధీ, సంబం ధిత అధికారులు పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి
రాజీవ్ యువ వికాసం ద్వారా అనేక మంది యువత ఉపాధి పొందుతారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం రాజీవ్ వికాసం పథకం పర్చేజ్ కమిటీ ఫర్ ఆల్ కార్పొ రేషన్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్థక శాఖ, ట్రాన్స్‌పోర్ట్, రిటైల్ షాప్ సర్వీసెస్, కమిటీ ఫర్ మ్యానుఫాక్చరింగ్, ఫిషరీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ తదితర శాఖలు కమిటీలో ఉన్నాయని తెలిపారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారుల ఫైనాన్సియల్ అసి స్టెంట్, గ్రౌండింగ్ తదితర వాటిపై సమీక్ష నిర్వ హించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఈడీఎస్‌సీ కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్, ఎల్‌డీఎం విజయ్‌కుమార్, జడ్పీ సీఈవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.