టీజీ-ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు
ABN , Publish Date - May 24 , 2025 | 11:02 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ నిర్వహించారు.

జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, మే 24 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీజీ-ఐపాస్ కింద పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు, వివిధ శాఖల వద్ద ఉన్న దరఖాస్తులకు అనుమతులను పరిశీలించి సకాలంలో ఆమోదించాలన్నారు. టీ-ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరి అభ్యర్థులకు 48 యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా జిల్లా కమిటీ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగులకు డిజిల్ ఎంప్లాయి మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ని రంతర ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో ఉన్న ఐటీఐ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాసైన విద్యార్థుల వివరాలను డీఈఈటీలో నమోదయ్యే లా చూడాలన్నారు. ఈ యాప్ గురించి విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో బీ సచిన్ జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్, రామ్మోహన్ జిల్లా పంచాయతీ అధికారి, రాఘ వేంద్రసింగ్ జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.