Share News

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - May 08 , 2025 | 11:11 PM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతితో భూ సమస్యలను శాశ్వత పరిష్కారం దొరుతుందని ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అన్నారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి

- ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి

- భూ భారతి చట్టంపై అవగాహన

మూసాపేట, మే 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతితో భూ సమస్యలను శాశ్వత పరిష్కారం దొరుతుందని ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొమిరెడ్డిపల్లిలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సకు అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో .రైతులకు అందుబాటులో భూ సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూములను దోచుకోవడానికి ధరణి చట్టం తయారు చేసిందన్నారు. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో బీఆర్‌ఎస్‌ పాలకుల భూ అక్రమాలు బయటపడి .జైలు పాలవుతామనే భయంతో తమ ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. అదే విధంగా రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డుల్లో పేర్లు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం, సర్వే నెంబర్‌ మిస్సింగ్‌, పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం లాంటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు అడ్డాకుల, మూసాపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అదే విధంగా రెండు మండలాల రైతులకు స్ర్పింక్లర్లు అందజేశారు. తహసీల్దార్‌ రాజు, కాంగ్రెస్‌ మండల శెట్టి చంద్రశేఖర్‌, తోట శ్రీహరి, మాజీ ఎంపీపీలు బుగ్గి కృష్ణయ్య, నాగార్జున్‌రెడ్డి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, డీసీసీ కార్యదర్శి గంగుల విజయమోహన్‌రెడ్డి, నాయకులు సాయిరెడ్డి, నిరంజన్‌, సంతోషి, బాలరాజు, లక్ష్మికాంత్‌రెడ్డి, లక్ష్మినారాయణ, బుచ్చన్నగౌడ్‌, రాములు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:11 PM