Share News

ఒత్తిడికి లోనవకుండా విధులు నిర్వహించండి

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:07 PM

నేడు ఆదవారం నిర్వహిస్తున్న రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మల్దకల్‌, అయిజ మండలాల్లో అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులపై ఎస్పీ శ్రీనివాసరావు శనివారం మల్దకల్‌, అయిజలో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు.

ఒత్తిడికి లోనవకుండా విధులు నిర్వహించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

  • జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం/అయిజ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నేడు ఆదవారం నిర్వహిస్తున్న రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మల్దకల్‌, అయిజ మండలాల్లో అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులపై ఎస్పీ శ్రీనివాసరావు శనివారం మల్దకల్‌, అయిజలో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు, అభ్యర్ధులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలీంగ్‌ స్టేషన్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, మద్యం, డబ్బు, ఉచితాలు పంపిణీ వంటి అక్రమాలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా ఓటు వేసేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:07 PM