జనజీవనం అతలాకుతలం
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:44 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుణుడి ప్రతాపంతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి.
పలుచోట్ల కూలిన ఇళ్లు.. నీట మునిగిన పంటల
జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుణుడి ప్రతాపంతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి. పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. పాత ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు తెగి రాకపోకలు నిలిచి పోయాయి. పంటపొలాల్లో నీళ్లు నిలిచిపోవడం తో రైతాంగం లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యా ప్తంగా పత్తి, కంది, మొక్కజొన్న పంట లు చేతి కందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.