ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:46 PM
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తు న్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం గ్రామాలలో పర్యటించి వరద పరిస్థితులను గమనిస్తూ ప్రభావిత ప్రాంతాలలో చర్యలు చేపట్టాలని ఎస్పీ జానకి ఆదేశించా
మహబూబ్‌నగర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తు న్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం గ్రామాలలో పర్యటించి వరద పరిస్థితులను గమనిస్తూ ప్రభావిత ప్రాంతాలలో చర్యలు చేపట్టాలని ఎస్పీ జానకి ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి నగరంలోని మినీట్యాంక్‌బండ్, రామయ్యబౌళి, అలీస్‌మార్ట్, ఎర్రగుంట చెరువులను పరిశీలిం చారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వాగులు, చెక్ డ్యామ్‌లు పొంగి ప్రవహిస్తున్నాయని, చెరువులు కుంటలు అలుగులు పారుతు న్నాయని ప్రజలు దాటే ప్రయత్నం చేయ వద్దన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పోలీ సులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్‌ను సమన్వయం చేసుకోవాలని సూచించారు. వర్షం తీవ్రత పెరిగిన సందర్భంలో తక్షణ చర్యలు తీసుకునేం దుకు కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అం దించాలని సూచించారు.