Share News

ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Sep 08 , 2025 | 10:55 PM

జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం సైబర్‌ వారియర్స్‌, డి4సీ సిబ్బంది తో జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సమావేశాన్ని నిర్వహించారు.

ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలి

  • సైబర్‌ వారియర్స్‌తో ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం సైబర్‌ వారియర్స్‌, డి4సీ సిబ్బంది తో జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలకు సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ వారియ ర్స్‌ రెగ్యులర్‌గా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన, ప్రజల్లో సైబర్‌ నేరాలబారిన పడకుం డా తగుసూచనలు ఇవ్వాలన్నారు. అలాగే సైబ ర్‌ సెల్‌తో సమన్వయం పనిచేస్తూ సోషల్‌ మీ డియాలో అనుమానాదస్పద కంటెంట్‌పై నిఘా ఉంచడం, డిజిటల్‌ ఫోరెన్సిక్‌, సైబర్‌ ఇంటలిజెన్స్‌ సేకరణ వంటి బాధ్యతలను కూడా సమర్ధవంతంగా చేయాలన్నారు. సైబర్‌ వారియర్స్‌ తమ బాధ్యతను నైతికంగా, చట్టబద్దంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, ఐటీసెల్‌ ఎస్‌ఐ షుకూర్‌, డి4సీ సిబ్బం ది, సైబర్‌ వారియర్స్‌ ఉన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 10:55 PM