Share News

బీఆర్‌ఎస్‌పై ప్రజలకు విశ్వాసం

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:37 PM

బీ ఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు పూర్తి స్థాయిలో వి శ్వాసం ఉందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తెలిపారు.

బీఆర్‌ఎస్‌పై ప్రజలకు విశ్వాసం
నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

- ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

అయిజ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీ ఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు పూర్తి స్థాయిలో వి శ్వాసం ఉందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో మండలంలోని పార్టీ ముఖ్య కా ర్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడుతో పాటు హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్ర అభివృద్దితో పాటు ప్రజా సంక్షేమ పథకాలతో చెరగని వేశార న్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ అభివృద్ధికి, అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సి ఉం దన్నారు. ఎలాంటి సమస్య, కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనం తరం పట్టణ నాయకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు జరగటం లేదని, వీధులలో ముగురు, తాగు నీటి సమస్యలు ఎ దుర్కొంటున్నారని మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ దేవన్న, మాల నర్సింహులు వారి దృష్టికి తీసుకె ళ్లారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుందర్‌రాజ్‌, సురేష్‌, నర్సింహులు, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 11:37 PM