దసరాకు ఊరు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:30 PM
దసరా పండగ సెలవుల్లో ఊరికి వెళ్లే ప్రజలు పోలీస్ శాఖ సూచించిన జాగ్రత్తలను పాటించా లని ఎస్‌ఐ స్వాతి పేర్కొన్నారు.
అమరచింత, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : దసరా పండగ సెలవుల్లో ఊరికి వెళ్లే ప్రజలు పోలీస్ శాఖ సూచించిన జాగ్రత్తలను పాటించా లని ఎస్‌ఐ స్వాతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... దసరా సె లవులను పురస్కరించుకొని గ్రామస్థులు చాలా వరకు వేరే ఊరికి వెళ్తుంటారని, ఆ సమయం లో తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ప్రజలు జా గ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు. న గలు, డబ్బులు ఇంట్లో పెట్టకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలన్నారు. గ్రామాల్లో అనుమానా స్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీస్ శాఖ కు సమాచారం అందించాలని ఆమె కోరారు. పండగ సందర్భంగా గొర్రెలు, మేకలు దొంగత నాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని, పెంపకందారులు తగిన జాగ్రత్తలు పాటించాల న్నారు.