పింఛన్ పెంచి అందజేయాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:15 PM
దివ్యాంగులతో పాటు చేయూత పింఛన్ దారులకు పింఛన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పింఛన్‌దారులతో కలిసి సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
జడ్చర్ల/దేవరకద్ర/మిడ్జిల్, నవాబ్‌పేట సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగులతో పాటు చేయూత పింఛన్ దారులకు పింఛన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పింఛన్‌దారులతో కలిసి సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు దగ్గుల బాలరాజు, మండల అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు రూ.6 వేలు, చేయూత పింఛన్ రూ.4 వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. అధికారంలోకి వచ్చి 21 నెలలైనా నేటికీ పింఛన్ పెంపు అంశంపై పెదవి విప్పడం లేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ నర్సింగ్‌రావుకు వినతిపత్రం అందచేశారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు యాదయ్య, సుజాత, పద్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు భీంరాజ్, మహేష్, కరాటే శ్రీను, రాజేశ్, శ్రీనివాస్, నాయకులు రాంమోహన్, నాగరాజు, కేశవ్, బిచ్యానాయక్ పాల్గొన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలో దివ్యాంగులు, పింఛన్‌దారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, తహసీల్దార్ దీపికకు వినతిపత్రం అందజేశారు. మిడ్జిల్ మండల కేంద్రంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ పులి రాజుకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాఽధ్యక్షుడు సురేష్‌మాదిగ, నాయకులు బి.వెంకటయ్య, గోపాల్, రాణి, లాలమ్మ, గోపాల్‌రెడ్డి, జంగమ్మ, నాగయ్య, మాధవి, లక్ష్మమ్మ, ఇస్తారయ్య, ఎల్లయ్య, జంగయ్య, చెన్నయ్య, బాలయ్య పాల్గొన్నారు. నవాబ్‌పేట మండల కేంద్రంలో దివ్యాంగుల సంఘం జిల్లా ఇన్‌చార్జి జైపాల్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు శాంతయ్య మాదిగ, శంకర్ మాదిగ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.