Share News

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:12 PM

జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు అం గన్‌వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు.

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి
అంగన్‌వాడీ కేంద్రాల సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్ష

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు అం గన్‌వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటివసతి, విద్యుత్‌ సౌక ర్యం, తదితర పనులు సకాలంలో పూర్తికాకపోవడానికి కారణాలేంటని అడిగారు. ఏమైనా సమస్యలు ఉండే పరిష్కరించి డిసెంబరు 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మా ణంలో ఉన్న పలుఅంగన్‌వాడీ కేంద్రాల భవనా లు కూడా ఫిబ్రవరిలోగా పూర్తి కావాలన్నారు. జిల్లాలోని 69 అంగన్‌వాడీ కేందాల్ర ఆవరణలో కూరగాయల సాగుకు పోషణ్‌ వాటికల నిర్మాణ పనులు కూడా ఈనెల చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ సౌకర్యంలేని అంగన్‌ వాడీ కేంద్రాల్లో నిర్దేశిత గడువులోగా కనెక్షన్‌ ఇ వ్వాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించా రు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనుల పురోగతిపై తాను తరచూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నా రు. ఆయా మండలాల్లో చేపట్టిన పనులను సం బంధిత ఇంజనీర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌ ఈఈ ప్రభాకర్‌, జిల్లా సంక్షేమాధారి సునంద సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 11:12 PM