పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:01 PM
పెండింగ్ డీఏ బిల్లులను మంజూరు చేసి నూతన పీఆర్సీ కమిటీ రిపోర్టును వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేష్ డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ డీఏ బిల్లులను మంజూరు చేసి నూతన పీఆర్సీ కమిటీ రిపోర్టును వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను మంజూరు చేయాలని, నూతన వేతన సవరణ కమిటీ రిపోర్టును అమలు చేయాలని, దీర్ఘ కాలికంగా పెండింగ్‌లో ఉన్న బెనిఫిట్స్‌ను వెంటనే మంజూరు చేయాలన్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు పలు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దాన్ని సరిదిద్దాలన్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ఇష్టారీతిగా ఉపాధ్యాయులను ఇతర పాఠశాలకు పంపించారని, దీనిపై సంబంధిత ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిర్వహించిన కుటుంబ సర్వే డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని వారి డబ్బులు చెల్లించాలన్నారు. నాయకులు కిష్టయ్య, ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, కోషాధికారి భాస్కర్, వేణుగోపాల్, శివరాజ్, అర్చన, శ్రీనివాసులు పాల్గొన్నారు.