Share News

ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , Publish Date - May 13 , 2025 | 11:11 PM

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వ హించిన పాలి సెట్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా పాలిసెట్‌
పేట డిగ్రీ కళాశాలలో అభ్యర్థులను తనిఖీ చేస్తున్న అధికారులు

- పేట జిల్లాలో 1382 మందికి 1303 మంది హాజరు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం/ నారాయణపేట, మే 13 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వ హించిన పాలి సెట్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్‌గర్‌ జిల్లా లోని ఐదు కేంద్రాల్లో, పేట జిల్లాలోని మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగింది. కేంద్రాల కు విద్యార్థులు గంట ముందే చేరుకోవడం తో సందడి నెలకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3,381 మందికి గాను 3,190 మం ది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 191 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షల కన్వీనర్‌ మోహన్‌బాబు కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా, నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 511 మంది విద్యార్థులకు గాను 486 మంది హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 240 మం దికి 224 మంది పరీక్షలు రాయగా బ్రిలియంట్‌ హైస్కూల్‌లో 240 మం దికి 223 మంది పరీక్షలు రాశారు. కోస్గి రెండు కేంద్రాల్లోని ఇంజనీరింగ్‌ కళాశాలలో 240 మందికి 228 మంది పరీక్షలు రాయగా, కోస్గి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 151 మందికి 142 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. మొత్తం పేట జిల్లా వ్యాప్తం గా 1382 మందికి 1303 మంది పరీక్షలు రాసినట్లు జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 11:11 PM