Share News

ప్రశాంతంగా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:18 PM

పట్ట ణంలోని కన్యకాపరమేశ్వరి వాసవి మాత దేవా లయంలో కొత్తకోట ఆర్యవైశ్య సంఘం ఎన్ని కలు శనివారం ప్రశాంతంగా నిర్వహించారు.

ప్రశాంతంగా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

కొత్తకోట, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : పట్ట ణంలోని కన్యకాపరమేశ్వరి వాసవి మాత దేవా లయంలో కొత్తకోట ఆర్యవైశ్య సంఘం ఎన్ని కలు శనివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఎ నిమిది మంది అధ్యక్ష పదవికి పోటీ పడి చివరి సమయానికి ఆరుగురు తప్పుకున్నారు. పోటీలో చంద్రకాంత్‌, వెంకటరమణ ఉండగా.. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గం ట వరకు ఓటింగ్‌ జరిగింది. 3 గంటకు కౌటింగ్‌ ప్రక్రియ చేపట్టగా... 820 ఓట్లకు గాను 590 ఓ ట్లు పోల్‌ అయ్యాయి. చంద్రకాంత్‌కు 454 ఓట్లు రాగా... వెంకటరమణకు 131 ఓట్లు వచ్చాయి. చంద్రకాంత్‌ 323 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ట్లు ఎన్నికల అధికారి ప్రభాకర్‌శెట్టి ప్రకటించా రు.

గెలుపొందిన చంద్రకాంత్‌ను శంకర్‌, నాగ రాజు, రాజు, శ్రీనివాసులు, రమణ, విజయ్‌, న రహరి, వాసు తదితరులు సన్మానించారు.

Updated Date - Jul 26 , 2025 | 11:18 PM