అమరుల త్యాగాలతోనే.. శాంతి
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:14 PM
ప్రజలకు శాంతియుత వాతావరణం అందించడంలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. వారి త్యాగం వల్లే స మాజం శాంతియుతంగా సాగుతోందని చెప్పారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవా(ఫ్లాగ్ డే)న్ని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించారు.
జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
పోలీసు అమరులకు ఘన నివాళి
మహబూబ్‌నగర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు శాంతియుత వాతావరణం అందించడంలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. వారి త్యాగం వల్లే స మాజం శాంతియుతంగా సాగుతోందని చెప్పారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవా(ఫ్లాగ్ డే)న్ని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఎస్పీ జానకి ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అమరులైన 191 మంది పేర్లను చదివి వినిపించారు. అనంతరం డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ మాట్లాడుతూ సంఘ విద్రోహుల పట్ల పోలీసులు ఎప్పటికీ కఠినంగానే వ్యవహరిస్తారన్నారు. తర్వాత అమరుల స్థూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఆ సమయంలో అమరుల కుటుంబ సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అక్కడ దివంగత ఎస్పీ పరదేశీనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురే్‌షకుమార్, జైల్ సూపరింటెండెంట్ వెంకటేశం, కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.