ఎన్నికల్లో శాంతియుతంగా పాల్గొనాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:06 PM
ప్రజలు, అభ్యర్థులు శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, మీ భద్రతే మా బాధ్యత అని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలు, అభ్యర్థులు శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, మీ భద్రతే మా బాధ్యత అని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ, మూడో విడత నామినేషన్ ప్రారంభ ప్రక్రియ ఒకే రోజు జరుగుతున్నందున ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం జిల్లాలోని ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, మానవపాడు, ఉండ వల్లిలో పర్యటించారు. ఎర్రవల్లి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అ క్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి గొడవలకు తావులేకుండా కొనసాగించాలన్నారు. ప్రజల భద్రత కోసం అహర్నిశలు పాటు పడతామని, ఎవరైనా ఒత్తిడికి గురి చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికలు ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ అని, అభ్యర్థులు భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై ఎవరైనా ఒత్తిడి, బెదిరిస్తే, ఉపసంహరణకు బలవం తం చేస్తే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.