గాలివానకు దెబ్బతిన్న బొప్పాయి తోట
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:24 PM
మండ లకేంద్రంతో పాటు పలుగ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన అకాలవర్షం, గాలివానకు పంట లు దెబ్బతిన్నాయి.

మల్దకల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మండ లకేంద్రంతో పాటు పలుగ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన అకాలవర్షం, గాలివానకు పంట లు దెబ్బతిన్నాయి. శేషంపల్లి గ్రామంలో రైతు రమేశ్‌కు చెందిన బొప్పాయితొట నేలకొరిగి, తీ వ్రనష్టం వాటిల్లింది. ఐదు ఎకరాల్లో బొప్పాయి తోట సాగుచేయగా, కోతకు వచ్చే సమయంలో అకాలవర్షం, గాలివాన వచ్చిందని, దాదాపు 400 వందల నుంచి 500ల బొప్పాయి చెట్లు విరిగిపడ్డాయని రైతు తెలిపారు. తనకు పంట నష్టపరిహారం ఇప్పించి ప్రభుత్వపరంగా ఆదుకో వాలని అధికారులను కోరారు.