Share News

పాలమూరు - రంగారెడ్డిని పూర్తి చేయాలి

ABN , Publish Date - May 04 , 2025 | 11:13 PM

గత ప్ర భుత్వం పాలమూరు - రంగారెడ్డిని నిర్లక్ష్యం చే సింది..

 పాలమూరు - రంగారెడ్డిని పూర్తి చేయాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహా

పాలమూరు, మే 4 (ఆంధ్రజ్యోతి) : గత ప్ర భుత్వం పాలమూరు - రంగారెడ్డిని నిర్లక్ష్యం చే సింది.. దాని ఫలితంగా జిల్లా అభివృద్ధిలో నది జలాల సద్వినియోగంలో తీవ్రమైన నిర్లక్ష్యానికి అన్యాయానికి గురైంది. నేటి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ డిమాండ్‌ చే శారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమా వేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్రవా దులు చేసిన దాడిలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి జిల్లాలో సహాజ సంపద, సాగు యోగ్యం భూములు పుష్కలంగా ఉన్నా పాలకుల ద్వంద విధానాలతో జిల్లా సమగ్ర అ భివద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చం దంగా ఉందన్నారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజె క్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని కల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి బి.బాలకిషన్‌, గోవర్దన్‌, అల్వాల్‌రెడ్డి, డి.రాము, బీఆర్‌ విల్సన్‌, కోటకదిర నరసింహా, చాందపాషా, సత్యనారాయణరెడ్డి, సి.రాజు, పె.పద్మావతి పాల్గొన్నారు.

భవన నిర్మాణ వెల్ఫేర్‌ బోర్డు రక్షణ కోసమే సమ్మె

భవన నిర్మాణ వెల్ఫేర్‌ బోర్డు రక్షణ కోసమే దేశవ్యాపిత సమ్మె చేపట్టినట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం భవ నంలో ఏర్పాటు చేసిన జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల చట్టం 1996, వలస కార్మికుల చట్టం 1979 పునఃరుద్దరించాలని, కార్మిక వ్యతి రేక నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని ద శాబ్దాల పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మి కుల కేంద్ర చట్టం, అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం, కాంట్రాక్టుకార్మికుల చట్టం 1970,తదితర 29చట్టాలను సాధించుకున్నామని తెలిపారు. భవననిర్మాణ కార్మిక సంఘం రాములు, వరద గాలెన్న, ముడా మాజీ చైర్మన్‌ గంజి వెంకన్న, వెంకటయ్య, వరద లక్ష్మయ్య

Updated Date - May 04 , 2025 | 11:13 PM