ఆల్మట్టి ఎత్తు పెంపుతో పాలమూరు ఎడారి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:47 PM
ఆల్మట్టి ఎత్తు పెంచితే ఉమ్మడి పాలమూరుకు అ త్యం త ప్రమాదకరమని, పాలమూరుకు బతుకుదెరువే వ్యవసాయమని, అలాంటి జిల్లా ఎడారిగా మారుతుం దని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని పిలు పునిచ్చారు.
- మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆల్మట్టి ఎత్తు పెంచితే ఉమ్మడి పాలమూరుకు అ త్యం త ప్రమాదకరమని, పాలమూరుకు బతుకుదెరువే వ్యవసాయమని, అలాంటి జిల్లా ఎడారిగా మారుతుం దని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని పిలు పునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాం మ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రె డ్డిలతో కలిసి మాట్లాడారు. ఇది వరకు పోతిరెడ్డిపాడు తోనే తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచి 100 టీఎంసీల నీ టిని నిలుపుకునేందుకు లక్షన్న ర ఎకరాల భూసేకరణకు ప్రయత్నం చేస్తున్నారని తెలి పారు. దీనిపై పోరాటం చేయకపోతే జిల్లాకు తీరని అ న్యాయం జరుగుతుందన్నారు. అన్ని పార్టీలు కలిసి కేం ద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి పోరాడదా మని పిలుపునిచ్చారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలన అట్టర్‌ప్లాప్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతు న్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మన్ను తీయలేదని మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. పనులు చేస్తారేమోనని రెండేళ్లు సమయమిచ్చామని.. మరో 15-20 రోజులు వేచిచూసి తొందరలోనే తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి గా వదిలేసే పరిస్థితి కనిపిస్తున్నందున దీనిపై తమ పార్టీ పెద్దఎత్తున పోరాటం చేస్తుందన్నారు. ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ త న వ్యవసాయ క్షేత్రంలో తల్లిదండ్రులు శాంత, నారాయణగౌడ్‌ల విగ్రహాలను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మం త్రులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మా ట్లాడితే పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై వి మర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ రాష్ట్రంలో ఇప్పుడే కొత్త గా అధికారంలోకి వచ్చినట్లు గతం మాకు సంబంధం లేదన్నట్లుగా వ్య వహరిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు ముందు పదేళ్లు అధికారంలో ఉంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నిం చారు. పదేళ్లలో ఇలాంటి యూరియా కష్టాలు రైతులు ఎన్నడూ చూడలేదని, సకాలంలో అందించడంలో విఫ లమయ్యారన్నారు. స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వే షన్లకు చట్టబద్దత తీసుకువచ్చిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వేంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు.