Share News

జగద్గురువుల రాకతో పాలమూరు పావనం

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:40 PM

జగద్గురువుల రాకతో పాలమూరు పామనమైందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, భూత్పూర్‌ మునిసిపాలిటీ కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో సోమవారం పంచాచార్య యుగమానోత్సవం, మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.

జగద్గురువుల రాకతో పాలమూరు పావనం
జగద్గురువులకు స్వాగతం పలుకుతున్న స్థానికులు

- మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

- భక్తిశ్రద్ధలతో యుగమానోత్సవం

- వందలాదిగా తరలి వచ్చిన భక్తులు

భూత్పూర్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి) : జగద్గురువుల రాకతో పాలమూరు పామనమైందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, భూత్పూర్‌ మునిసిపాలిటీ కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో సోమవారం పంచాచార్య యుగమానోత్సవం, మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వీరశైవ సమాజం జిల్లా, మండల అధ్యక్షుడు ముక్త శ్రీశైలం, నాగరాజుల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జగద్గురువులు ఉజ్జయిని సద్ధర్మ సింహాసనాధీశ్వర సిద్ధలింగ శివాచార్యులు, శ్రీశైల సూర్య సింహాసనాధీశ్వర సిద్ధరామ పండితారాధ్య శివాచార్యులు, కాశీజ్ఞాన సింహాసనాఽధీశ్వర చంద్రశేఖర శివాచార్యులు, మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య మహాస్వాములు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీ డీకే అరుణ, పాలమూరు ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, వివిద పీఠాల అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ప్రతీ మనిషి ధర్మ సంరక్షణ కోసం పాటు పడాలన్నారు. హిందు ధర్మ సంస్థాపనకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం జగద్గురువులు భక్తులనుద్దేశించి మాట్లాడారు. పాలమూరు జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవుడు ఎక్కడో లేడని, మంచి మనసున్న ప్రతీ ఒక్కరిలో కొలువై ఉన్నాడని తెలిపారు. ఇస్లాం మతానికి ఉన్నట్లుగానే వీరశైవ లింగాయత్‌లకు కూడా 856 అనే సంఖ్య ఉందని శ్రీశైల సూర్య సింహాసనాధీశ్వర శివాచార్య మహాస్వామి తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 11:40 PM