Share News

ఎడ్యుకేషనల్‌ హబ్‌గా పాలమూరు

ABN , Publish Date - May 15 , 2025 | 10:53 PM

ఇంజనీరింగ్‌, లా, ఐఐఐటీ తదితర విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, పాల మూరును ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని

ఎడ్యుకేషనల్‌ హబ్‌గా పాలమూరు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

- ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణ

- ఎప్‌సెట్‌లో 114 మందికి మెరుగైన ర్యాంకులు

- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- విద్య మాత్రమే శాశ్వతం : కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం మే 15 (ఆంధ్రజ్యోతి) : ఇంజనీరింగ్‌, లా, ఐఐఐటీ తదితర విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, పాల మూరును ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌ నగర్‌లోని ప్రభుత్వ బాలికలు, బాలుర జూని యర్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు ఎప్‌సెట్‌ కోసం మహబూ బ్‌నగర్‌ ఫస్ట్‌ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ‘పయనీర్‌’ పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. వారిలో 114 మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. వారిని గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిర బోయి ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కన్న కలలను విద్యార్థులు నిజం చేశారన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజు కంటే ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నానన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. కలెక్టర్‌ విజయేందిర బో యి మాట్లాడుతూ విద్య ఒక్కటే శాశ్వతమని తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ జీఎన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ పాలమూరులో విద్యారంగ అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీఐఈవో కౌసర్‌జహాన్‌, ప్రిన్సిపాల్‌ భగవంతాచారి మాట్లాడారు. కార్య క్రమంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహా రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనితా రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ కుమార్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీ ఆర్‌టీయు వ్వవస్థాపకుడు గాల్‌రెడ్డి హర్ష వర్ధన్‌రెడ్డి, జేపీఎన్‌సీఈ చైర్మన్‌ కేఎస్‌ రవి కుమార్‌, రిషి కళాశాల అకాడమిక్‌ డైరెక్టర్‌ వెంకటయ్య, ప్రతిభ కళాశాల డైరెక్టర్‌ వెంకటే శ్వర్‌రెడ్డి, సీఎంవో బైకాని బాలుయాదవ్‌, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 10:53 PM