ఘనంగా పాగుంట వెంకన్న రథోత్సవం
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:04 PM
కోరి న కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న పాగుంట లక్ష్మీవెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
కేటీదొడ్డి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కోరి న కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న పాగుంట లక్ష్మీవెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో స్వామివారి రథోత్స వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగం గా ముందుగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆల యంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథానికి పూజ లు చేశారు. భక్తులతో కలిసి రథాన్ని లాగా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసం తోషాలతో పాడిపంటలు బాగా పండించి కళకళలాడుతూ ఉండాలని స్వామివారిని ప్రా ర్థించినట్లు తెలిపారు. అలాగే రథోత్సవ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట స మితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్, గద్వాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు పాల్గొన్నారు. బ్రహ్మో త్సవంలో భాగంగా జరిగే రథోత్సవ కార్యక్ర మంలో తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొన్నారు. ఎమెల్యే వెంట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ హన్మంతు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, శ్రీధర్‌గౌడ్, వెంకట్రాములు, వెంక ట్రామిరెడ్డి, రాజశేఖర్, రామకృష్ణనాయుడు, విజయ్, వెంకటాపురం గోపి, ఉరుకుందు, యుగంధర్‌గౌడ్, రాజేష్ ఆయాగ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.