ఉస్మానియా ఆస్పత్రి ప్రొఫెసర్ సర్వేశ్వర్‌రెడ్డి మృతి
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:12 PM
జిల్లాకు చెందిన ప్రాఫెసర్ పి.సర్వేశ్వర్‌రెడ్డి అనారోగ్యం తో గురువారం హైదరాబాద్‌లో మృతి చెందా రు.

- జోగుళాంబ గద్వాల జిల్లా గార్లపాడులో నేడు అంత్యక్రియలు
ధరూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ప్రాఫెసర్ పి.సర్వేశ్వర్‌రెడ్డి అనారోగ్యం తో గురువారం హైదరాబాద్‌లో మృతి చెందా రు. నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పనిచేసిన ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారని మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గార్లపాడు కృ ష్ణారెడ్డి తెలిపారు. గద్వాల మాజీ ఎమ్మెల్యే దివంగత పాగ పుల్లారెడ్డి అల్లుడు అని, ప్రస్తు తం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా కొనసాగుతూ అనారో గ్యంతో మృతి చెందారని తెలిపారు. సర్వేశ్వర్ రె డ్డి అంత్యక్రియలు శుక్రవారం ధరూర్ మండ లం గార్లపాడులో నిర్వహించనున్నట్లు తెలిపా రు. ప్రొఫెసర్‌కు భార్య, కూతురు వైద్యవృత్తిలో, కుమారుడు ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నారు.